హైదరాబాద్ : మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda barrage) వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు పైనున్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేతతో భారీ ప్రవా హం కొనసాగుతున్నది. అలాగే స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల (Heavy rains) ప్రాణహిత, గోదావరి నదులు (Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 8,52,240 క్యూసెక్కులకు చేరు కోగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.
అన్నారం బ్యారేజీకి 3లక్షల 92వేల 543 క్యూసెక్కుల వరద రావడంతో 66 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు పంపిస్తున్నారు. కాగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.