Harish Rao | ఖమ్మం : ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పర్యటించారు. కరుణగిరిలో వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. వరద బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కానీ.. కనీసం కిందకు దిగకుండా వెళ్లిపోయారని వాపోయారు. నిన్న రేవంత్ రెడ్డి వచ్చిపోయినా కూడా ఎలాంటి సాయం అందలేదు. కనీసం మంచి నీరు కూడా ఇచ్చేవాడు లేడంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖమ్మం వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. తమకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు హరీశ్‌రావు ధైర్యం చెప్పారు. తమ పార్టీ అండగా ఉంటుందని, కొద్దిసేపట్లోనే మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు హరీశ్‌రావు.
Breaking News
ఖమ్మం కరుణగిరిలో వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. pic.twitter.com/YwMVgejyzc
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024
ఇవి కూడా చదవండి..
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి ఇలాకాలో ప్రభుత్వ స్థలాలు కబ్జా