నాగర్కర్నూల్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వట్టెం రిజర్వాయర్ పంపు హౌస్(Vattem Reservoir pump house) నీట మునిగిందని(Flooded) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) విమర్శించారు. వర్షాలకు వట్టెం(పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) జలాశయం లోకి వరదనీరు చేరడంపై ఆయన స్పందించారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే పంపు హౌస్ నీట మునిగిందని ఆరోపించారు. రైతుల పట్ల నిర్లక్ష్యమే ఈ పంప్ హౌస్ మునగుటకు కారణం అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని పేర్కొన్నారు.
త్వరితగతిన ఈ నష్టాన్ని అంచనా వేసి వట్టెం పంప్ హౌస్ పనులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సాగు, తాగునీరు అందించే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాలకు నష్టపోయిన పంటలను అంచనా వేయాలి. తెగిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయాల్నారు. బీటీ రోడ్లను పునరుద్ధరించి రైతులకు పంట నస్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.