Jupally Krishna Rao | కొల్లాపూర్ : రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కొల్లాపూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాలు చేయడం మూలంగా ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చే వారికి ద్విచక్ర వాహనాలను నిలుపుకునేందుకు కానీ కనీసం నిల్చునేందుకు కూడా స్థలం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.
గతంలో నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రజలకు ఆటంకం లేని ఖాళీ స్థలాలలో చిన్నపాటి డబ్బాలు వేసుకుంటే తొలగించిన వారే.. ఇప్పుడు అదే స్థలాల్లో డబ్బాలు ఏర్పాటు చేసుకుని దందాలు కొనసాగిస్తుంటే.. ఎందుకు తొలగించడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Sagar Left Canal | సాగర్ ఎడమ కాలువకు గండి.. పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
Dindi Vagu | డిండి వరదలో చిక్కుకున్న చెంచులు సురక్షితం
Jr NTR | తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్