Sagar Left Canal | సూర్యాపేట : కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనిగూడెం గ్రామాల నుండి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కాలువను పరిశీలించి, గ్రామ ప్రజలతో మాట్లాడారు.
సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన వారిలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు స్థానిక నాయకులు ఉన్నారు.
సాగర్ ఎడమ కాలువ దగ్గరికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్ర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం.
దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. pic.twitter.com/A9DRdKKxnm
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024
ఇవి కూడా చదవండి..
Medigadda barrage | మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల
Sangareddy | సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలు.. ఐలాపూర్ తండాలో 20 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు