సంగారెడ్డి: హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్పూర్ మండలంలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఐలాపూర్ తండాలో 119 సర్వేనంబర్‌లో సుమారు 20 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన అధికారులు.. బుల్డోజర్లకు పనిచెప్పారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ నిర్మాణాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు. దానిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా అమీన్‌పూర్‌లోని ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఆక్రమణలను తొలగించారు. 15 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు.