RS Praveen Kumar | హైదరాబాద్ : ఎస్సీలు, బహుజనుల పట్ల మరీ ఇంత వివక్షనా..? అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఏ తిరుపతి.. స్టేషన్ ఘన్పూర్ సంక్షేమ గురుకుల హాండ్ బాల్ అకాడమీలో చదువుకుంటున్నాడు. అయితే తిరుపతి జోర్డాన్‌లో జరుగుతున్న 10th ఏషియన్ జూనియర్ మెన్ హాండ్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత టీం తరపున సెలక్ట్ అయ్యాడు.
తిరుపతి కోచింగ్‌కు, ప్రయాణానికి కావాల్సిన రూ. 2,20,000 రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి పోటీలకు పంపించాలి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. దీంతో తిరుపతి తండ్రి రూ. 70 వేలు అప్పు చేశాడు. మిగతా డబ్బును టీచర్లు, గ్రామస్తులు, స్నేహితులు సమకూర్చి జోర్డాన్‌కు పంపించారని ఆర్ఎస్పీ గుర్తు చేశారు.
క్రికెటర్ సిరాజ్‌కు కోట్ల రూపాయల నజరానా, 600 గజాల స్థలం బంజారాహిల్స్‌లో కేటాయించగలిగినపుడు, ఈ బాలుడికి రెండు లక్షల రూపాయలు కూడా కేటాయించలేరా? అదే విధంగా అగసార నందిని ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన కూడా ఆమె మీద మీ ప్రభుత్వానికి ఇంకా కరుణ కలగడం లేదు. బహుజన వర్గాలకు చెందిన అమ్మాయనేనా ఈ వివక్ష? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారూ.. మీ ఖజానాలో డబ్బులు ఎక్కడ పోతున్నయి? ఎవరి జేబుల్లోకి చేరుతున్నయి?? బహుజన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు.. ఇకనైనా నిద్ర లేవండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
ఎస్సీల, బహుజనుల మీద మరీ ఇంత వివక్షనా @revanth_anumula గారు?
ఈ ఫోటోలోని బాలుడి పేరు ఎ. తిరుపతి, ఆసిఫాబాదు జిల్లా వాసి. స్టేషన్ ఘనపూర్ సంక్షేమ గురుకుల హాండ్ బాల్ అకాడమీ లో చదువుతున్నాడు.
ఈ బాలుడు 10th Asian Junior Men Hand Ball Championship పోటీలకు భారత టీంలో సెలక్టు అయ్యిండు. ఇవీ… pic.twitter.com/vsAvzCCBdM— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 3, 2024
ఇవి కూడా చదవండి..
Heavy rains | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు
VishwakSen | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన హీరో విశ్వక్ సేన్
Jr NTR | తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్