Jr NTR | రెండు తెలుగు రాష్ట్రాలను (two Telugu states) భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. రంగంలోకి దిగిన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ (Jr NTR) మంచి మనసు చాటుకున్నారు.
వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం (Relief Fund) ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara)లో నటిస్తున్న విషయం తెలిసిందే. తీరప్రాంత నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుథ్, నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్.
Also Read..
Illegal Affair | ఒకే మహిళతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం.. సస్పెండ్
Deepika Padukone: దీపికా పదుకుణే మెటర్నిటీ ఫోటోషూట్.. పిక్స్‌కు లైక్ కొట్టిన ఫిల్మ్ స్టార్స్
Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. నేడు మరో 20 రైళ్లు రద్దు