న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి దీపికా పదుకుణే(Deepika Padukone).. మెటర్నిటీ ఫోటోషూట్‌లో పాల్గొన్నది. గర్భంతో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. కొన్ని ఫోటోల్లో తన భర్త రణ్వీర్ సింగ్‌తో కూడా ఆమె ఫోటోలు దిగింది. ఆ ఫోటోలకు ఆమె ఎమోజీలను పోస్టు చేసింది. దిష్టితగలకుండా కంటి ఎమోజీతో పాటు ఇన్ఫినీటీ ఎమోజీని పోస్టు చేసింది. ఇక ఆమె ఫ్యాన్స్ నుంచి ఆ పోస్టుకు ఫుల్ లైక్స్ వస్తున్నాయి. అభిమానులు, స్నేహితులు, కుటుంబీకులు, తోటివారు.. ఇన్‌స్టా పోస్టుకు రియాక్ట్ అవుతున్నారు. హాలీవుడ్ హీరో విన్ డీజిల్ కూడా దీపికా ఇన్‌స్టా పోస్టుకు లైక్ కొట్టేశాడు. కామెంట్ సెక్షన్లో అతను చేతులు జోడించి ఉన్న ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. హార్ట్‌తో పాటు ఫైర్ ఎమోజీలను పోస్టు చేసింది. కత్రినా కైఫ్ కూడా హార్ట్ ఎమోజీలను పోస్టు చేసింది.
దీపికా, రణ్వీర్ జంట ఫిబ్రవరి 29వ తేదీన ఇన్‌స్టా పోస్టులో తమ తొలి సంతానం గురించి ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో తమకు బేబీ పుట్టనున్నట్లు ఆ పోస్టులో చెప్పిన విషయం తెలిసిందే. కల్కి 2898 చిత్రంలో దీపిక నటించింది. రోహిత్ శెట్టి తీస్తున్న సింగంలో నటిస్తోంది.