చెన్నై: ఒకే మహిళతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం (Illegal Affair) పెట్టుకున్నారు. విషయం కాస్తా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. తమిళనాడులోని కళ్లకురిచి (kallakurichi) జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని పిల్లూర్‌కు చెందిన రమణి, అశోక్ భార్యా భర్తలు. గత నెల 19న రమణిని ఆమె భర్త అశోక్ హత్యచేసి పరారయ్యాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ సంబంధర్భంగా.. తిరునావలూర్ ఎస్సై నందగోపాల్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పారు. ఇదే విషయమై రమణిని నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అదికాస్తా పెద్దదికావడంతో ఆమెను హత్యచేసినట్లు తెలిపారు.
దీంతో ఎస్ఐ నందగోపాల్‌పై ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తు జరిపారు. ఈ సందర్భంగా రమణితో వివాహేతర సంబంధం నిజమేనని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. విళుపురం రేంజ్ డీఐజీ దిశా మిట్టల్ నందగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా విళుపురం జిల్లా మరక్కాణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్.. కళ్లకురిచిలో పనిచేసే సమయంలో రమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో అతడిని కూడా అధికారులు సస్పెండ్ చేశారు.