హైదరాబాద్ : రాష్ట్రంలో(Telangana) వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారి పైకి చేరిన గోదావరి వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.