Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈ రోజు పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల. పురుషోత్తంరెడ్డి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు గ్రామస్తులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | 1908లో నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ కూలగొడుతున్నడు.. హరీశ్‌రావు ఫైర్
Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్పు.. ఫోర్త్ సిటీ వరకు మెట్రో