Harish Rao | కృష్ణా నదీ జలాలను ఏపీ అప్పనంగా తీసుకుపోతున్నదని..సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చోని చోద్యం చూస్తున్నాడని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నానని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు అన్నారు. ఇండ్లెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు. ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నడని హరీష్ రావు ప్రశ్నించారు.
28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నదని హరీష్ రావు తెలిపారు. ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుంది అని కేఆర్ఎంబీకి లేఖ రాసింది.వెంటనే బోర్డు మీటింగ్ పెట్టండి, ఏపీ నీటి దోపిడిని ఆపండి అని ఈఎన్సీ రాసిన లేఖలో ఉంది.28న లేఖ రాసిండు, 31న ఈఎన్సీ రిటైర్ అయ్యారు.ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా పోస్టు నింపలేదు.లెక్కకు మించి నీళ్లు తీసుకుపోతుంటే మనకు ఈఎన్సీ పోస్టు నింపలేదు.వారం రోజుల తర్వాత మీడియా ప్రశ్నిస్తే పోస్టు నింపింది.బోర్డు మెంబర్ ఆయన. ఖాళీ పోస్టు ఎందుకు పెట్టారు.వాటా కుదరలేదా..? మాట కుదరలేదా.. ? వారం రోజులు ఎందుకు ఖాళీగా ఉంచారు.. రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టదా.. ? అని హరీష్ రావు ప్రశ్నించారు.
ఈ వాటర్ ఇయర్లో జనవరి 29,2026 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకున్నది.టెంపరరీ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ 66 శాతమే వాడాలి.కానీ 80 శాతం వాడింది.రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి గడ్డి పీకుతున్నడా..?చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లుఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగడు. రేవంత్‌కు గురువు గారు ఉన్నరని భయం. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లు మూసుకు ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. వేసవి వస్తున్నది, తెలంగాణకు నీటి అవసరాలు ఉన్నయి. పంటలకు, పారిశ్రామిక అవసరాలు ఉన్నాయన్నారు.
రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నడు..
తెలంగాణ అవసరాలు పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా..? తాత్కాలికంగా అయినా మనం 34శాతం వినియోగించుకోవాలి కానీ వినియోగించుకున్నది 20 శాతం వాటా. మన రాష్ట్రానికి 174 టీఎంసీలు వాడుకునేది ఉన్నది. అయినా వినియోగించుకోరు. ఈ రోజుకు కూడా ఏపీ 1.5 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నది. మన పంటలు ఏం కావాలె. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలి. సర్కారు నడుపుతున్నరా..? సర్కస్ నడుపుతున్నరా..? అని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల వినియోగంలో బీఆర్ఎస్ పాలనతో పోల్చితే కాంగ్రెస్ హయాంలో ఎవర్ లోయెస్ట్ వాడుకున్నం అని ఇప్పటికే అనేక సార్లు చెప్పినం. వరుసగా రెండు సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నడు. ఈ ఏడాది 20 శాతం దాటలేదు. ముఖ్యమంత్రి వైఫల్యానికి ఇది నిదర్శనం . ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పాలిట శాపంగా తయారైండు. హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి హక్కులను కాలరాస్తున్నడని అన్నారు.
పాలన మీద పట్టు లేదు, పట్టి లేదు..
పాలన మీద పట్టు లేదు, పట్టి లేదు.. రేవంత్ రెడ్డికి రెండు లేదన్నారు హరీష్ రావు. కేఆర్ఎంబీకి లేఖ రాసి మేం చెప్పిన ఏపీ నీటి వినియోగం వాస్తవం అని ఒప్పుకున్నారు.
ఏపీ అడ్డగోలుగా నీళ్లు వాడుతున్నది అడ్డుకోమని ఇప్పుడు లేఖ రాశారు. మేం ప్రశ్నించినప్పుడే మీరు నిద్ర లేచి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తెలంగాణకు ఇంత నష్టం అవుతుండేనా..? అని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నామమాత్రంగా లేఖ రాయడం తప్ప మీరు చేస్తున్నదేం లేదు. 664 టీఎంసీలు ఏపీ తీసుకుపోయిందని ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాస్తే, కేఆర్ఎంబీ రాసిన లేఖలో 555 టీఎంసీలు తీసుకుపోయిందని ప్రస్తావించింది. వంద టీఎంసీలు తక్కువ చేసి కేఆర్ఎంబీ చెబుతున్నది అంటే.. అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ ఏపీని ప్రశ్నించదు. బీజేపీ ప్రభుత్వం చేతిలో కేఆర్ఎంబీ ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ మీద పడి ఏడ్వడం తప్పిదే..నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరు..? కేఆర్ఎంబీని ఎందుకు నిలదీయరన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం ఏమిటి..?
ఆర్ఆర్ టాక్స్ ఎక్కడ బయటకు వస్తదో, స్కాంలు ఎక్కడ బయట పడుతవో అని రేవంత్ మౌనంగా ఉంటరు..? బీజేపీ కూడా అట్లాగే మౌనంగా ఉంటది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. అడ్డగోలుగా ఏపీకి నీళ్లు తరలిస్తూ తెలంగాణ రైతుల నోళ్లు కొడుతున్నరు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం ఏమిటి..? రేవంత్, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతారా..? చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు కానీ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నరని ప్రశ్నించిన హరీష్ రావు. బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే స్పందించి ఏపీ నీళ్ల తరలింపును అడ్డుకోవాలని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైనున్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం. కేంద్ర మంత్రిని కలుస్తాం. పార్లమెంట్ లో గట్టిగా లేవనెత్తుతాం. బీ
జేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి తెలంగాణ హక్కులను కాపాడటంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. 19 ప్లేసుల్లో బీఆర్ఎస్ టెలిమెట్రీలు పెడితే.. మిగతా 9 ప్లేసుల్లో పెట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని హరీష్ రావు పేర్కొన్నారు.
Live: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం https://t.co/j9ds93jfDv
— BRS Party (@BRSparty) February 10, 2026
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల