(Governor) హైదరాబాద్: ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం పురోగమన దిశగా పయనించడం శుభపరిణామం అని గవర్నర్ తమిళిసై అన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ ఉన్నత విద్యలో ఎంతో ముందున్నదని కితాబునిచ్చారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుకు రాష్ట్రాలు కేంద్రంతో సహకరించాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ విద్యావిధానంపై రెండు రోజుల సదస్సును గవర్నర్ తమిళసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో కూడా నిత్యం జాతీయ విద్యా విధానంపై అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యావేత్తలతో ఆన్లైన్లో ఎన్నో అంశాలపై చర్చలు జరిపామని చెప్పారు. జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయాల్సిన ఆవశ్యకతపై అన్ని వర్శిటీల వీసీలతో చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఎందుకో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం గురించి సంకోచిస్తున్నాయని అనిపిస్తున్నదని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఎన్ఈపీ అమలుకు సహకరించాలని యూనివర్శిటీల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. జాతీయ విద్యా విధానాన్ని హడావుడిగా, అసంపూర్ణంగా తీసుకొచ్చింది కాదన్నారు. పలువురు విద్యావేత్తలు, పరిశోధకుల అభిప్రాయాలు, అంశాలను పరిగణలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో వర్శిటీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరుగాలని సూచించారు. అమ్మాయిల పెండ్లి వయసు 21 గా చేసినందుకు ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గవర్నర్ చెప్పారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..