PM CARES Fund | పీఎం కేర్స్ ఖర్చు పూర్.. విరాళాలు 480 కోట్లు, ఖర్చు మాత్రం 87.85 లక్షలే
అత్యవసర, విపత్తు పరిసితుల్లో బాధితులను ఆదుకోవడానికి మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘పీఎం కేర్స్ ఫండ్' ఉద్దేశం, లక్ష్యం..కాగితాలకే పరిమితమైంది. ఏటా వందల కోట్ల రూపాయాలు విరాళాలుగా, బ్యాంక్ వడ్డీల రూపంలో జమవుతున్నా..ఫండ్ నుంచి బాధితుల కోసం మోదీ సర్కార్ చేస్తున్న వ్యయం నామమాత్రంగా ఉంది.
- ఒక్క శాతం దాటని వ్యయం
- విరాళాలు 480 కోట్లు..ఖర్చు మాత్రం 87.85 లక్షలే
- బాధితులను ఆదుకోని నరేంద్ర మోదీ సర్కార్!
న్యూఢిల్లీ, ఆగస్టు 19: అత్యవసర, విపత్తు పరిసితుల్లో బాధితులను ఆదుకోవడానికి మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘పీఎం కేర్స్ ఫండ్’ ఉద్దేశం, లక్ష్యం..కాగితాలకే పరిమితమైంది. ఏటా వందల కోట్ల రూపాయాలు విరాళాలుగా, బ్యాంక్ వడ్డీల రూపంలో జమవుతున్నా..ఫండ్ నుంచి బాధితుల కోసం మోదీ సర్కార్ చేస్తున్న వ్యయం నామమాత్రంగా ఉంది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రం విడుదల చేసిన ఆడిట్ నివేదికలోని గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. 2024-25లో వచ్చిన విరాళాల్లో వ్యయం కేవలం ఒక్క శాతం (0.18) కూడా దాటలేదు. ఆ ఏడాది ఫండ్‌కు దాదాపు రూ.480 కోట్ల విరాళాలు రాగా, దీంట్లో నుంచి కేంద్రం చేసిన వ్యయం కేవలం రూ.87.85 లక్షలుగా ఉంది. ఇదంతా పిల్లల కోసం ఖర్చు చేసినట్టుగా తెలిపింది. అదే ఏడాది బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్స్ రూపంలో రూ.469 కోట్లు ఫండ్‌కు జమయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24లో రూ.15.60 కోట్లు)తో పోలిస్తే వ్యయం గణనీయంగా తగ్గింది. ఆ ఏడాది రూ.682 కోట్లు విరాళాలు అందగా, వ్యయం రూ.15.37 కోట్లుగా (2.28 శాతం) ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను అమలుజేసే ఏజెన్సీల నుంచి ఫండ్‌కు రూ.324 కోట్లు వాపస్ లభించాయి.
పాఠశాలలకు పీఎం కేర్స్ నిధులెందుకు వాడరు?
దేశంలో పాఠశాలలకు పీఎం కేర్స్ నిధులు ఎందుకు వాడరని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. పీఎం కేర్స్ నిధులు 2024-25లో రూ.8,452 కోట్లు ఉన్నాయన్న దీప్కే .. పీఎం కేర్స్ నిధులు గణనీయంగా పెరుగుతున్నా వాటిని ఖర్చు చేయట్లేదన్నారు. వాటితో వెయ్యి హైటెక్ మోడల్ స్కూళ్లు కట్టొచ్చన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

