Balka Suman | నిరుద్యోగులను నట్టేట ముంచి.. తన ఇంట్లో మూడు పదవులు దక్కించుకున్నారు.. మంత్రి వివేక్‌పై బాల్క సుమన్ ఫైర్
Balka Suman | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం దగా, వైఫల్యాలు, అన్ని వర్గాల విధ్వంసమే అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Balka Suman | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం దగా, వైఫల్యాలు, అన్ని వర్గాల విధ్వంసమే అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాతనపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజిరెడ్డి, TGBKS నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 33 నెలల పాలనలో కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని బాల్క సుమన్ అన్నారు. కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని.. కానీ రాష్ట్రంపై ₹4 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల భారం మోపారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల నిధులతో చెన్నూర్ దూసుకుపోయిందన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్‌లలో 9 విడతల్లో వేలాది మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌ను, పారిపెల్లి, అస్నాద్ నూతన మండలాల జీవోలను రాజకీయ కక్షతో మంత్రి కావాలనే అడ్డుకున్నారని బాల్క సుమన్ అన్నారు.
ఎన్నికల్లో చెన్నూర్ యువతకు 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మంత్రి వివేక్ నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. యువతకు 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కానీ, వారి ఇంట్లో మాత్రం మూడు రాజకీయ పదవులు దక్కించుకున్నారని విమర్శించారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులకు రావాల్సిన ₹12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

