Harish Rao | నాణ్యమైన విద్య అందించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం : హరీశ్ రావు
Harish Rao | రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు.
Harish Rao | రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. ఈ అంశంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.
Also Read..
Kane Williamson: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్
IndiGo flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
North Korea: పుతిన్‌కు రెడ్‌కార్పెట్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన కిమ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

