క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేన్ విలియమ్సన్(Kane Williamson) తప్పుకున్నాడు. కివీస్ తరపున 91 వన్డేలు, 75 టీ20లకు నాయకత్వం వహించాడు. 2024-25 సీజన్‌కు సంబంధించి జాతీయ కాంట్రాక్టు నుంచి కూడా అతను వైదొలిగాడు. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ నుంచి గ్రూప్ స్టేజ్‌లోనే న్యూజిలాండ్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. చివరి మూడు టీ20 వరల్డ్ కప్స్‌లో న్యూజిలాండ్ జట్టు సెమీస్ వరకు వెళ్లింది. 2021లో ఫైనల్స్ లోనూ ఆడింది. కివీస్ తరపున దాదాపు 350 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను.. మూడు ఫార్మాట్లలోనూ క్రికెట్‌ను కొనసాగించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా జాతీయ కాంట్రాక్టు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు.
Kane Williamson steps down from white-ball captaincy. He led New Zealand in 91 ODIs and 75 T20Is, taking them to back-to-back ICC tournament finals 🇳🇿
The end of an era. pic.twitter.com/zQKSyEUi8d
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2024