T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్ (Taskin Ahmed)ను మళ్లీ స్క్వాడ్‌లోకి తీసుకుంది. స్వదేశంలో ఐర్లాండ్ సిరీస్‌కు దూరమైన తస్కిన్‌ను పొట్టి ప్రపంచకప్ కోసం ఎంపిక చేశారు. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి శనివారం బంగ్లా బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. లిటన్ దాస్ సారథిగా 15 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు.
భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి పురుషుల టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు నెల రోజులే ఉండడంతో బంగ్లాదేశ్ బోర్డు స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా, మొహమ్మద్ సైఫ్ హొసేన్ వైస్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని తీసుకుంది. ఇటీవల ఆసియా కప్‌లో జట్టును నడిపించిన జకీర్ ఆలీ(Zaker Ali)పై వేటు పడింది. ఫామ్‌లో ఉన్న మాజీ కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటోను సైతం సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. గ్రూప్ సీలో ఉన్న బంగ్లాదేశ్ టోర్నీ ఆరంభం రోజే రెండుసార్లు విజేత వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇదే గ్రూప్‌లో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ ఉన్నాయి.
🇧🇩’s squad for the T20 World Cup is in! pic.twitter.com/WcVPFV1gGK
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2026
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : లిటన్ కుమార్ దాస్(కెప్టెన్), మొహమ్మద్ సైఫ్ హొసేన్(వైస్ కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొసేన్, కాజీ నురుల్, మహేది హసన్, రిషద్ హొసేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, షైఫుద్దీన్, షొరిఫుల్ ఇస్లాం.
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తున్న భారత ప్రభుత్వం.. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు బ్రేక్ వేసింది. అంతేకాదు బీసీసీఐ ఆదేశాల మేరకు ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పించింది కూడా. దాంతో.. ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చేందుకు కొన్ని షరతులు పెట్టనుంది బంగ్లా క్రికెట్ బోర్డు. మెగా టోర్నీ సమయంలో తమ ఆటగాళ్లు, మీడియా, స్పాన్సర్లకు భద్రత కల్పిస్తామని బీసీసీఐ హామీ ఇవ్వాలని బంగ్లా బోర్డు కోరనుంది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్