హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Beerla Ilaiah) భూదందాల ఐలయ్యగా మారాడని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి(Gongidi Sunitha Reddy) ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కొలనుపాకలో 7 ఎకరాల 22 గుంటల భూమిని 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇలాంటి వ్యక్తి కేటీఆర్ మీద మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ స్థాయి ఎక్కడ నీ స్థాయి ఎక్కడ అని నిలదీశారు. ఎలాంటి పర్మిషన్ల్ లేకుండా రాత్రికి రాత్రి భూములు రిజిస్ట్రేషన్ చేయించాడని ఆరోపించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన భూ దందాలపై సీబీఐ, ఈడీకేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా బీర్ల ఐలయ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కేటీఆర్ మీద కేసు పెట్టారు. లగచర్ల రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీద కేసు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీసిన బీఆర్ఎస్ నాయకులను బెదిరుస్తున్నా. భూ ఆక్రమణలకు పాల్పడిన బీర్ల ఐలయ్య మీద చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్