జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న గోనుపాడు దగ్గర రోడ్డు ప్రమాదంలో మెరిసా అనే మహిళ మృతి చెందింది. కాగా, మృతదేహాన్ని కుటుంబ సభ్యులు దవాఖానలోని మార్చురీలో ఉంచారు. అయితే మృతదేహాన్ని భద్రపరిచే సమయంలో ఉన్న నగలు తర్వాత కనిపించలేదు. మృతురాలి ఒంటిపై ఉన్న తులం బంగారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దవాఖాన సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.