Dil raju | నా మూవీ ఫంక్షన్‌కి సినీ ప్రముఖులు రాలేదని జితేందర్ రెడ్డి సినిమా హీరో రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. అయితే యువ హీరోల సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో సపోర్ట్ రావాట్లేదని వస్తున్న వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం క. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకోంది. అయితే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు మేకర్స్. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దిల్ రాజు ఈ మధ్య యువ హీరోల సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో సపోర్ట్ రావాట్లేదని అని వస్తున్న వార్తలపై స్పందించాడు.
యువ హీరోలకు ఒకటే చెబుతున్న. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఎదో అంటున్నాడు అని మీరు భయపడకుడదు. కిరణ్‌కు ప్రతిభ ఉంది కాబట్టే క సినిమాతో ఈరోజు సక్సెస్ అయ్యాడు. మీ దర్శకుల దగ్గర ట్యాలెంట్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఇక్కడ టాలెంట్ మాత్రమే మిమ్మల్ని గుర్తిస్తుంది. మీకు సక్సెస్ వచ్చినప్పుడే మాలాంటి పెద్దలం వచ్చి అభినందిస్తున్నాం. ఈ సినిమా మీది. ఈ జర్నీ మీది. ఎవరో ఎదో చెస్తారు ఇండస్ట్రీలో అంటే ఎవరు ఏం చేయరు. మొన్న నా మూవీ ఫంక్షన్‌కి సినీ ప్రముఖులు రాలేదని జితేందర్ రెడ్డి సినిమా హీరో రాకేష్ అన్నాడు. రారు అమ్మ ఎందుకు వస్తారు. ఎవరి బిజీ వాళ్లది. ఎవరి లైఫ్ వాళ్లది. సినీ ప్రముఖులు వచ్చారా రాలేదా అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎలా ప్రేక్షకుల దగ్గరికి నీ సినిమాకు తీసుకెళ్లావు అనేది ముఖ్యం. సో ఎటువంటి అంచనాలను పెట్టుకోకుండా మీరు కష్టపడి సినిమాను తీసి ఈ కంటెంట్‌తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్లండి అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.
Only your hard work and success speaks.
No one will support or pull you back– #DilRaju at #KA success meet pic.twitter.com/Z6IsyZ6A0i
— Suresh PRO (@SureshPRO_) November 8, 2024