ఖమ్మం : తడి చేతులతో సెల్‌ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్‌కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ దంపతులకు కూతురు అంజలి కార్తీక(9), కుమారుడు వెంకట గణేశ్ ఉన్నారు. అయితే ఉదయం తండ్రి వద్ద నుంచి అంజలి కార్తీక సెల్ ఫోన్ తీసుకున్నది. దానికి చార్జింగ్ లేకపోవడంతో తడి చేతులతో చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో విలవిల్లాడుతూ కుప్పకూలింది.
కొద్ది సేపటికి గమనించిన తల్లిదండ్రులు చేతులు, కాళ్లు రుద్దినప్పటికీ స్పర్శ లేకపోవడంతో అదే గ్రామంలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన ఆయన బాలిక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించా రు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంజలి కార్తీక అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నది. కాగా.. ఘటనా స్థలాన్ని ఎస్సై నాగుల్‌మీరా సందర్శించారు. తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
iPhone | కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. ఐ-ఫోన్లపై బంపరాఫర్.. భారీగా ధరలు తగ్గించిన ఆపిల్..!
Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!
Hyderabad | వారం రోజుల పాటు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ భానుడు ప్రత్యక్షం..