సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:40

గ్రామాలవారీగా నాలుగేండ్ల ప్రణాళిక

గ్రామాలవారీగా నాలుగేండ్ల ప్రణాళిక

  • సిద్ధంచేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశం
  • హరితహారం విజయవంతానికి పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాలవారీగా రానున్న నాలుగేండ్లకు ప్రణాళికలు సిద్ధంచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్‌ తరహాలో గ్రామ ప్రణాళికలు కూడా ఉండాలని చెప్పారు. జిల్లాలవారీగా ప్రోగ్రెస్‌కార్డు సైతం సిద్ధంచేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావుతో ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామాల్లోని శానిటేషన్‌, గ్రీన్‌ కవర్‌, స్ట్రీట్‌లైట్‌ కమిటీలు సమర్థంగా పనిచేసేలా చూడాలని చెప్పారు. గ్రామాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను వ్యూహాత్మకంగా వినియోగించుకుని పనులు చేపట్టాలని సూచించారు. కల్లాల నిర్మాణం, 25వ తేదీన ప్రారంభమయ్యే తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులంతా కలిసి ఈ బాధ్యతలను నిర్వర్తించేలా చర్యలు తీసుకోవడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.logo