వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ లారి ఆటోలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మామునూర్ హైవేపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు రోడ్డు పక్కనే ఉన్న ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు ఇనుప స్తంభాల కింద ఇరుక్కోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..