Thalapathy Vijay | ఇటీవల రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన చివరి చిత్రం దళపతి69లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందరూ గోట్ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మరో సినిమాను ప్రకటించాడు విజయ్. తన చివరి చిత్రం ప్రజ సమస్యలపై ఉండబోతున్నట్లు ప్రకటించాడు. దళపతి 69 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు.
అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం నుంచి రిపబ్లిక్ డే కానుకగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘జన నాయగన్'(ప్రజల నాయకుడు)(Jana Nayagan) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్ చూస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో యువతతో సెల్ఫీ దిగుతున్నట్లు ఫస్ట్ లుక్ ఉంది.
We call him #JanaNayagan #ஜனநாயகன் ♥️#Thalapathy69FirstLook#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/t16huTvbqc
— KVN Productions (@KvnProductions) January 26, 2025