The Delhi Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రశంసలతో పాటు బీజేపీ ప్రాపగండా మూవీ అంటూ విమర్శలు అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ది దిల్లీ ఫైల్స్’. ‘ది బెంగాల్ ఛాప్టర్’ అనేది ఉపశీర్షిక.
ఈ సినిమాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన టాలీవుడ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 15న ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు టీజర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి రాజ్యంగంలోని భారత రాజ్యాంగ ప్రవేశిక(Preamble to the Constitution of India)ను చదువుతూ నడుస్తున్నట్లు ఈ వీడియోను కట్ చేశారు మేకర్స్. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. మరోవైపు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలావుంటే ఈ సినిమాపై నెటిజన్లు ప్రాపగండా మూవీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ ప్లాన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.