మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 11:49:35

కేసీఆర్‌కు ఆపిల్‌ పండ్లు అందించిన కెరమెరి రైతు బాలాజీ

కేసీఆర్‌కు ఆపిల్‌ పండ్లు అందించిన కెరమెరి రైతు బాలాజీ

హైదరాబాద్‌: తెలంగాణలో మొదటిసారిగా ఆపిల్‌ పండ్లను పండించిన కెరమెరి ఆపిల్‌ రైతు బాలాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పండించిన తొలి పంటను సీఎం కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా రైతు బాలాజీని సీఎం అభినందించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి మండలం ధనోరాకు చెందిన బాలాజీ ఆపిల్‌ పండ్లను పండించారు. ఈ తెలంగాణ ఆపిల్‌ పండ్లు మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ల్లో అందుబాటులోకి రానున్నాయి. రైతు బాలాజీని హైదరాబాద్‌కు రావాల్సిందిగా సీఎం పేషీ అధికారులు సోమవారం రాత్రి సూచించారు.


logo