e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home News రామాఫలం.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష

రామాఫలం.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష

సీతాఫలం గురించి అందరికీ తెలుసు. రామాఫలం గురించి కొందరికే తెలుసు. అరుదుగా లభించే ఈ పండులో పోషక విలువలు మెండు. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌, కొవ్వు, ప్రొటీన్‌, విటమిన్‌ బి1,బి2,బి3,బి5,బి6, విటమిన్‌ సి, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

  • సీతాఫలం తీపి ఫలమైతే రామాఫలంలో తియ్యదనం తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును నిరభ్యంతరంగా తినొచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి కూడా.
  • రామాఫలంలోని విటమిన్‌ బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి ముఖంపై మొటిమలను నివారిస్తాయి. శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపటంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ పండుద్వారా లభించే మంచికొవ్వు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది.
  • ఇందులోని పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ బ్యాలెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదు, సహజ యాంటీ బయాటిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణం కలిగిన రామాఫలం విరేచనాలను నియంత్రిస్తుంది. న్యూమోనియా, టైఫాయిడ్‌ వంటి అనారోగ్యాలకూ ఔషధంగా పనిచేస్తుంది.
  • ఇందులోని క్యాల్షియం ఎముకలకు సత్తువనిస్తుంది. ఎముకలు పెళుసు బారడం, కీళ్లనొప్పుల సమస్యలు దూరమవుతాయి.
  • చర్మం అక్కడక్కడ నలుపు రంగులోకి మారే హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్య నివారణకు రామాఫలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే నలుపు మటుమాయం అవుతుంది.
  • రామాఫలాన్ని తినడమే కాదు దీని గుజ్జును హెయిర్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనివల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
  • ఈ పండులోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పేగులను శుభ్రం చేసి జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దురద తగ్గించడంలో, చర్మ సంరక్షణలో, వార్ధక్య ఛాయలను నియంత్రించడంలో రామాఫలం ఔషధంగా పనిచేస్తుంది. అరుదుగా లభించే ఈ పండు దొరికితే తినకుండా వదలొద్దని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

-మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
రామాఫలం.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement