కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 24 : ఇంటర్-24 ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని మెయిన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ విజయంలో పాలు పంచుకున్న అధ్యాపక బృందానికి కూడా అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అంకిత భావంతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులు నిరూపించారని చెప్పారు. శ్రీ చైతన్య గ్రూఫ్ ఆఫ్ జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేరాఫ్‌గా నిలువడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం సెకండియర్ ఫలితాల్లో ఎంపీసీలో బూక్య హరిక 988, జీ మహాలక్ష్మి 988, బైపీసీలో ఎం వివేక్ 987, ఎంఈసీలో టీ హారిక 965, సీఈసీలో జే ప్రశాంత్ 972, ఫస్టియర్‌లో ఎంపీసీలో ఆర్ వైష్ణవి 468, జీ శ్రీనిత్య, బీ వర్షిత్, బీ అక్షర, ఎస్ విష్ణువర్ధన్ 467మార్కులు, 466 మార్కులు 14 విద్యార్థులు, బీపీసీలో ఎన్ భార్గవి, ఎస్ మేఘనశ్రీ, ఏ అభ్యుదయ 436, జీ మధుహాసిని 435, ఎంఈసీలో ఆర్ హన్సిక 473, సీఈసీలో ఏ మధుమిత 484 మారులు సాధించారన్నారు. అనంతరం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలు స్థాపించి నేటికి ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా రమేశ్ రెడి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, మోహన్ రావు, ఏజీఎం శ్రీనివాస్, లెక్చరర్లు పాల్గొన్నారు.