కమాన్చౌరస్తా, ఏప్రిల్ 24 : ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్లోని వావిలాలపల్లి కళాశాల ప్రాంగ ణం (ప్రైమ్ క్యాంపస్)లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఉన్నతమైన విదార్థులను తయారు చేయడంలో ట్రినిటీ విద్యా సంస్థలు ముందుంటాయని చెప్పారు. తమ పూర్వ విద్యార్థి నందాల సాయి కిరణ్ సివి ల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రస్తు తం ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మారులకు యశ్వంత్, మణిదీప్, వైశాలి, ఆసియా నూరిన్, అజయ్, సాత్విక్, రవ ళి 468 మారులు సాధించారన్నారు. అలాగే, షిఫా షకీల్, సాహితి, శ్రావ్య, వైష్ణవి, వైష్ణవి, సంజన, ప్రణతి, శ్రావ్య, హితేశ్, మహేశ్, డేవిడ్ రాజు, నవదీప్, మేఘన, శ్రీవందన 467 మా రులు, అలాగే మరో 23 మంది 466 మారు లు పొందారని చెప్పారు. బైపీసీలో సింధు 438 మారులు, అంజనీ, సుమయ్య ఫాతిమా, అనీ కా ఇస్పాత్, ప్రసన్న, ఆర్ సృజన కుమార్ 437 మారులు, అలాగే తొమ్మిది మంది విద్యార్థులు 438 మారులు సాధించారన్నారు. సీఈసీ విభాగంలో రమ్య 487 మారులు, మేఘనాథ్ 485 మారులు, ఎంఈసీ విభాగంలో రిషిక శర్మ 488 మారులు సాధించారని వివరించారు. సెకండియర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ప్రశాంత్ 992 మారులు, అభినయ 991, లహరి, శ్రీవిద్య, శ్రీతేజ, ప్రవళిక, మహాలక్ష్మి 990 మారులు సాధించారన్నారు. బైపీసీ విభాగంలో విదా హర్మిన్, రాణి, మెం జబీన్ 990 మారులు సాధించారని, అలాగే ఆరుగురు 989, నలుగురు 988 మారులు సాధించినట్లు చెప్పారు. సీఈసీ విభాగంలో సంజన 976 మారులు సాధించిందన్నారు.