హైదరాబాద్, ఏప్రిల్ 5: మూడో వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ మొబైల్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘హ్యాపీ డేస్-2021’ పేరుతో ప్రతీ కస్టమర్‌కు బహుమతి అందేలా సరికొత్త రీతిలో ఈ ఆఫర్లను తెచ్చినట్లు సంస్థ సీఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్‌లు తెలిపారు. రూ.3 కోట్ల విలువైన ప్రైజ్‌లతో వచ్చిన ‘హ్యాపీ డేస్-2021’లో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై అత్యధికంగా 10% క్యాష్‌బ్యాక్ అందుతున్నది. ఈఎంఐలపై 10% క్యాష్‌బ్యాక్‌తోపాటు ల్యాప్‌టాప్, ఎల్ఈడీ టీవీ ధరలపై 10% వరకు తగ్గింపులున్నాయి. కార్డులు, వాలెట్స్, ఫైనాన్స్‌పైనా క్యాష్‌బ్యాక్ ఇస్తున్న సంస్థ.. మొబైల్స్ మార్పిడిపై ప్రత్యేక ఆఫర్లనిస్తున్నది. అన్ని మొబైల్ యాక్ససరీస్‌పై 50% వరకు తగ్గింపు ఉండగా, అన్ని ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లనిచ్చింది.
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్‌లో ఇండ్లకు భలే గిరాకీ
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్‌బై