ఒక్కరోజే 2.16లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద ఆవిరి
సెన్సెక్స్ 870, నిఫ్టీ 229 పాయింట్లు పతనం
ముంబై, ఏప్రిల్ 5: మదుపరుల్లో మళ్లీ కరోనా భయాలు నెలకొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై దిగులు పట్టుకున్నది. దీంతో స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల సంపద కరిగిపోయింది. ఇది.. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు. దేశంలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. మార్కెట్లను కుప్పకూల్చింది. రోజుకు లక్ష దాటిన కేసులు.. పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు దారితీశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 870.51 పాయింట్లు లేదా 1.74 శాతం కోల్పోయి 49,159.32 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,449.03 పాయింట్లు దిగజారింది. అయితే మళ్లీ 580 పాయింట్ల వరకు కోలుకున్నది. అయినప్పటికీ మదుపరుల సంపద రూ.2 లక్షల 16,566.52 కోట్లు హరించుకుపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.2,05,09,835.27 కోట్లకు పరిమితమైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 229.55 పాయింట్లు లేదా 1.54 శాతం పడిపోయి 14,637.80 వద్ద స్థిరపడింది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌లో 18 పైసలు క్షీణించి 73.30కు పరిమితమైంది.
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్‌లో ఇండ్లకు భలే గిరాకీ
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్‌బై
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- nifty
- Sensex
- Stock Markets
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

