ఐఐటీ హైదరాబాద్ అద్భుత సృష్టి
ఐఐటీ హైదరాబాద్ | లక్ట్రిక్ వాహనాల్లో (ఈవీల్లో) విరివిగా వినియోగిస్తున్న లెడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా 5వీ డ్యూయల్ కార్బన్ బ్యాటరీని ఐఐటీ హైదరాబాద్ కెమిస్ట్రీ విభాగ పరిశోధన బృందం ఆవిష్కరించింది.

లిథియం బ్యాటరీ కంటే మెరుగైన బ్యాటరీ ఆవిష్కరణ
పర్యావరణ అనుకూలం, ఖర్చు 25% తక్కువే
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఎంతో లబ్ధి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ మరో అద్భుత ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీల్లో) విరివిగా వినియోగిస్తున్న లెడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా 5వీ డ్యూయల్ కార్బన్ బ్యాటరీని ఐఐటీ హైదరాబాద్ కెమిస్ట్రీ విభాగ పరిశోధన బృందం ఆవిష్కరించింది. అనేక విశిష్ఠతలు కలిగిన ఈ బ్యాటరీ.. లిథియం-అయాన్ బ్యాటరీ కంటే ఇది ఎంతో మెరుగైనది, చవకైనది, పర్యావరణ అనుకూలమైనది కావడం విశేషం. అనేక సెల్ల సమాహారమైన లిథియం-అయాన్ బ్యాటరీని తయారు చేయడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం.
అందులోని ఏ ఒక్క సెల్లో సమస్య ఏర్పడినా అది మొత్తం బ్యాటరీ చార్జింగ్‌పై ప్రభావం చూపుతుంది. లేదంటే మొత్తంగా బ్యాటరీనే పనిచేయకుండా మొరాయిస్తుంది. దీన్ని మరమ్మతు చేయడం కూడా సవాళ్లతో కూడినదే. మరోవైపు లిథియం-అయాన్ బ్యాటరీల్లో వినియోగించే కోబాల్ట్, మాంగనీస్, నికెల్ లాంటి విషపూరితమైన లోహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. కానీ 5వీ డ్యూయల్ కార్బన్ బ్యాటరీలో ఇలాంటి విషపూరితాలేవీ ఉండవు. అంతేకాకుండా లిథియం బ్యాటరీ తయారీకి అయ్యే ఖర్చు కంటే దాదాపు 25 శాతం తక్కువ ఖర్చుతోనే దీన్ని రూపొందిచామని, 100 వాట్ల ఓల్టేజీని కలిగి ఉండే ఈ బ్యాటరీని ఈవీకి అమర్చితే గంటపాటు ప్రయాణించవచ్చని పరిశోధక బృందం వెల్లడించింది. అధిక శక్తితో నడిచే వైద్యపరికాలు, స్టేషనరీ గ్రిడ్స్, బ్రేకింగ్ సిస్టమ్స్‌కు 5వీ డ్యూయల్ కార్బన్ బ్యాటరీ ఎంతో అనువుగా ఉంటుందని తెలిపింది.
లిథియం బ్యాటరీకి సరైన ప్రత్యామ్నాయం..
ఈవీలకు సంబంధించిన విడిభాగాలతోపాటు, వాటిని మరమ్మతు చేసే నిపుణుల కొరత చాలానే ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీ అనేక సంక్లిష్టతలతో కూడినది కావడంతో ఈవీ అమ్మకాలపై ప్రభావం చూపుతున్నది. ఈ ప్రధాన సమస్యను అధిగమించడంలో భాగంగానే మేం డ్యూయల్ కార్బన్ బ్యాటరీని ఆవిష్కరించాం. ఇది లిథియం బ్యాటరీకి సరైన ప్రత్యామ్నాయం. దీని ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
- డాక్టర్ సురేంద్ర కుమార్ మార్త,
అసోసియేట్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ విభాగం, ఐఐటీ హైదరాబాద్
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్‌లో ఇండ్లకు భలే గిరాకీ
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్‌బై
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

