Srisailam Project | శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుండి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,97,886 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,683 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,92,861క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 99,736 క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు చేరుకుంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127.5950 టీఎంసీలు ఉన్నాయి. 53,795 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కరెంట్ కోతలపై శాసనసభలో భట్టికి హరీశ్‌రావు సవాల్.. తోక ముడిచిన రేవంత్ సర్కార్
Harish Rao | రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి.. కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో : హరీశ్‌రావు
Harish Rao | బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నారు..! : హరీశ్‌రావు