మహబూబ్నగర్: ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద(Flood Flow) కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 74,000, ఔట్ ఫ్లో75,094 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.377 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి(Hydroelectricity) కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.