Nirmal | నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులు, సిబ్బంది ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిర్మల్ ఆస్పత్రికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు : కేటీఆర్
Rakesh Reddy | జీవో 29 సారాంశమే సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు.. రాకేశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం