Yadadri | యాదాద్రి భువనగిరి : ఆలేరు నియోజకవర్గం పరిధిలోని మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎలక్ట్రిక్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన షాపు యజమాని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Woman Molest | కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో బావి నీళ్లు తాగిన 30 మందికి అస్వస్థత