Woman Molest | అమరావతి : దసరా పండుగ వేళ దారుణం చోటు చేసుకుంది. వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై ఓ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉపాధి కోసం ఇటీవలే ఈ కుటుంబం బళ్లారి నుంచి వచ్చింది. వీళ్లు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.. ఈ కుటుంబం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసి వీళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. జిల్లా ఎస్పీ కూడా వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. బాధితులను ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో వైన్సులకు 85వేల దరఖాస్తులు!
Alia Bhatt | అలియా కుమార్తెకు ఊహించని గిఫ్ట్ పంపిన రామ్ చరణ్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నటి