హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాలకు 85వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1700 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా ఏపీలోని మద్యం షాపులకు అమెరికా, యూరోప్ దేశాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తెలిపారు. చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే దాదాపు 18వేల దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు.