Uttar Pradesh | నాలుగేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్.. మహిళా ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
Uttar Pradesh : ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లు సహజీవనం చేసిన కానిస్టేబుల్ చివరకు ఆమెను మోసం చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు.
Uttar Pradesh : ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లు సహజీవనం చేసిన కానిస్టేబుల్ చివరకు ఆమెను మోసం చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. దీంతో సహజీవనం చేసిన మహిళ (34) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఆగ్రాలోని తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు బాధిత మహిళ ఒక సూసైడ్ వీడియో విడుదల చేసింది. తన ఆత్మహత్యకు గల కారణాల్ని వివరించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. యూపీ, కాస్గంజ్ జిల్లాకు చెందిన బాధిత మహిళకు గతంలో వేరొక వ్యక్తితో పెళ్లై, విడాకులు తీసుకుంది. తర్వాత ఆగ్రాలో ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రైవేట్ సంస్థలో జాబ్ చేసేది. ఈ క్రమంలో ఆమెకు జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. ఇద్దరిమధ్యా సాన్నిహిత్యం పెరిగింది. అలా ఇద్దరూ నాలుగేళ్లు సహజీవనం చేశారు. ఇదే సమయంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని గౌతమ్ నమ్మించాడు. కానీ, నాలుగేళ్లయ్యేసరికి తనను పెళ్లి చేసుకోవడం కుదరదని కానిస్టేబుల్ చెప్పాడు. తన ఇంట్లో వాళ్లు వారి పెళ్లికి అంగీకరించడం లేదని, అందువల్ల ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పాడు. ఇదే సమయంలో మరో మహిళతో కానిస్టేబుల్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అయితే, తనను కానిస్టుబుల్ మోసం చేయడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆమె ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో తీవ్ర వేదనకు గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో వీడియోలో గౌతమ్‌పై, అతడి కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేసింది.
सुसाइड से पहले युवती ने यह वीडियो बनाया है. युवती ने पुलिस कांस्टेबल पर धोखा देने के आरोप लगाए हैं.
वीडियो में युवती कहती दिख रही है- नहीं करनी है तो मत करो शादी, लेकिन किसी लड़की को धोखे में तो मत रखो https://t.co/XRgwvo6rDY pic.twitter.com/B2GFPsSryV
— Priya singh (@priyarajputlive) March 13, 2026
గౌతమ్ ఈ నాలుగేళ్ల కాలంలో తనను మానసికంగా, శారీరకంగా లోబరచుకున్నాడని, అతడితోపాటు కుటుంబ సభ్యులు కూడా తనను వేధింపులకు గురి చేశారని తెలిపింది. తన ఆత్మహత్యకు గౌతమ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు కూడా కారణమని పేర్కొంది. గౌతమ్ తనను పెళ్లి చేసుకోవడంలో అభ్యంతరం లేదని అతడి అన్నయ్య చెప్పాడని, కానీ, గౌతమ్ మాత్రం కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని అన్నాడని ఆమె వివరించింది. వీడియో విడుదల చేసిన అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

