Alia Bhatt | బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ (Alia Bhatt) ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురికి ఎవరూ ఊహించిన గిఫ్ట్ పంపినట్లు తెలిపారు. దాన్ని చూసి ఒక్కసారిగా భయపడినట్లు చెప్పుకొచ్చారు.
అలియా భట్ నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అలియా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘రహా పుట్టిన నెల రోజుల తర్వాత.. రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్ పంపారు. అదో విచిత్రమైన అనుభవం. కొందరు మేడం ఎలిఫెంట్ (Elephant).. ఎలిఫెంట్.. అంటూ పరుగులు తీస్తూ వచ్చారు. ఎలిఫెంట్ ఏంటి..?, ఎవరు పంపారు..? అని నేను ఆశ్చర్యపోయా. ఎవరు పంపారు అని అడిగితే.. రామ్ చరణ్ సర్ పంపారు అని చెప్పారు. ఎవరైనా ఊహించగలరా..? చెప్పండి. దాన్ని చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యా’ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే, అది నిజమైన ఏనుగు కాదని.. చెక్కతో చేసిన భారీ సైజు బొమ్మ అని వివరించారు. ముందు దాన్ని చూసిన రహా భయపడిపోయిందని.. ఆ తర్వాత దాంతో ఆడుకోవడం మొదలు పెట్టిందని చెప్పుకొచ్చింది. ఆ భారీ బొమ్మను తమ డైనింగ్ టేబుల్‌కు దగ్గర్లో పెట్టుకున్నామని.. దాన్ని ముద్దుగా ‘ఏలే’ అని పిలుచుకుంటున్నట్లు తెలిపింది. కాగా, టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కి జోడీగా సీత పాత్రలో మెప్పించింది.
Also Read..
Boeing | సమ్మె ఎఫెక్ట్.. 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన బోయింగ్ సంస్థ
MS Dhoni | హాలీవుడ్ యాక్టర్లా ధోనీ.. తలా కొత్త హెయిర్ స్టైల్ చూశారా..?
Nayab Singh Saini | ఈనెల 17న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న ప్రధాని..!