Nayab Singh Saini | ఇటీవలే జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు రోజుల్లో అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది.
మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి బీసీ నేత నయాబ్ సింగ్ సైనీని (Nayab Singh Saini) సీఎం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయాబ్ సింగ్ సైనీనే రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా (Haryana Chief Minister) ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సైనీ నేతృత్వంలోని బీజేపీ కొత్త సర్కార్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల 17న పంచకులలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కానున్నట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో.. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీకే మద్దతు తెలిపారు.
Also Read..
AR Rahman | కమలా హారిస్‌కు మద్దతుగా కాన్సర్ట్.. 30 నిమిషాల వీడియోను రూపొందించిన ఏఆర్ రెహమాన్
Rahul Gandhi | ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పాఠాలు నేర్వరా..?.. రైలు ప్రమాద ఘటనపై రాహుల్ ఫైర్