Train Accident | చెన్నై (Chennai) సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్‌ను మైసూర్ – దర్భంగ భాగమతి ఎక్స్‌ప్రెస్ (Mysuru – Darbhanga Express) రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండు దగ్ధమయ్యాయి. సుమారు 12 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
మరోవైపు ఘటనా ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. పట్టాలపై బోగీలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ – డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు సహా.. కడప, తిరుపతి, అరక్కోణం, నెల్లూరు, సూళ్లూరుపేట, విజయవాడ రూట్లలో పలు రైళ్లను రద్దు చేసింది. మరోవైపు భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
ప్రమాద సమయంలో రైల్లో 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
#WATCH | Tiruvallur, Tamil Nadu: Railway Safety Commissioner of Southern Circle, Anant Madhukar Chowdhary inspects the spot at Kavarapettai accident spot where train no. 12578 Mysuru-Darbhanga Express had a rear collision with a goods train, last evening. 19 people were injured… pic.twitter.com/tOtDxJJTl1
— ANI (@ANI) October 12, 2024
Also Read..
Game Changer | రామ్ చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ వాయిదా.. సంక్రాంతికి కలుద్దాం అంటూ దిల్‌రాజు క్లారిటీ.!
Ajay Jadeja | నవానగర్ మహారాజుగా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా
Gold Price | గోల్డ్ హైజంప్.. ఒకేరోజు రూ.1,150 పెరిగిన తులం ధర