Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందని, 2025లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది.
అయితే ఈ వార్తలనే నిజం చేస్తూ.. మూవీని సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశాడు. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్. ముందుగా ఈ సినిమాను క్రిస్మస్కు రిలీజ్ చేద్దామని అనుకున్నాం కానీ వరల్డ్‌వైడ్‌గా చూస్తున్నప్పడు క్రిస్మస్ కంటే సంక్రాంతికి బాగుంటుందని నాతో పాటు నా డిస్టిబూటర్స్ అన్నారు. అయితే ఈ ఆలోచనను చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లం. ఎందుకంటే చిరు విశ్వంభర కూడా సంక్రాంతికే ఉంది. దీంతో ఈ విషయంపై చిరంజీవితో యూవీ క్రియేషన్స్ వారితో చర్చించగా.. వారు సానుకూలంగా స్పందించారు. విశ్వంభర కూడా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. డిసెంబర్ లోపల పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కంప్లీట్ అవుతాయి. అయితే మాకోసం తమ సినిమాను వాయిదా వేసుకున్న చిరంజీవి అలాగే విశ్వంభర టీమ్‌కి ధన్యవాదాలు. ఇక గేమ్‌ఛేంజర్ సంక్రాంతికి రావడం కన్ఫర్మ్ అయినట్లే. ఈ సినిమా కోసం డే అండ్ నైట్ మా టీమ్ కష్టపడుతుంది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నాం. సంక్రాంతి వరకు ఈ సినిమాకు సంబంధించి అన్ని అప్డేట్లను ప్రకటిస్తాం అంటూ దిల్ రాజు తెలిపాడు.
సంక్రాంతికి కలుద్దాం! ❤️🔥✊🏼#GameChanger
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @advani_kiara @iam_SJSuryah @actorsrikanth @yoursanjali @Naveenc212@AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555 @ZeeStudios_ @saregamaglobal @saregamasouth @PharsFilm… pic.twitter.com/57Ht1FRW8m
— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024