Rahul Gandhi | మైసూర్ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ ఘటన బాలాసోర్ (Balasore) ప్రమాదానికి అద్దం పడుతోందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
‘మైసూర్ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా పాఠాలు నేర్వలేదు. జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలి. ఈ ప్రభుత్వం మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు బలి కావాలి..?’ అంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
The Mysuru-Darbhanga train accident mirrors the horrific Balasore accident—a passenger train colliding with a stationary goods train.
Despite many lives lost in numerous accidents, no lessons are learned. Accountability starts at the top. How many more families must be… https://t.co/ggCGlgCXOE
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2024
చెన్నై (Chennai) సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్‌ను మైసూర్ – దర్భంగ భాగమతి ఎక్స్‌ప్రెస్ (Mysuru – Darbhanga Express) రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండు దగ్ధమయ్యాయి. సుమారు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో రైల్లో 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, గతేడాది జూన్ 2వ తేదీన ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. బహనాగా బజార్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌తో పాటు గూడ్స్ రైలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.
Also Read..
Rishabh Pant | నేను వేలంలో అమ్ముడవుతానా..? : రిషభ్ పంత్ ఆసక్తికర ట్వీట్
Vijayadashami | దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ