Vijayadashami | దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విజయ దశమి (Vijayadashami) శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా మాత, ప్రభు శ్రీరాముల ఆశీస్సులతో జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం ఉదయం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
देशवासियों को विजयादशमी की असीम शुभकामनाएं। मां दुर्गा और प्रभु श्रीराम के आशीर्वाद से आप सभी को जीवन के हर क्षेत्र में विजय हासिल हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 12, 2024
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
విజయ దశమిని పురస్కరించుకొని పలు ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలో నిల్చొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణో దేవి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ, బాసర సరస్వతీ దేవి, ఏడుపాయల వన దుర్గాభవాని, శ్రీశైల క్షేత్రం, తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని అంతా మంచి జరిగాలని ప్రార్థిస్తున్నారు.
#WATCH | J&K: Devotees queue up at Mata Vaishno Devi Temple in Katra as they arrive here to offer prayers on #VijayaDashami pic.twitter.com/ZCkxsmiFS1
— ANI (@ANI) October 12, 2024
Also Read..
KTR | ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. కేటీఆర్ ట్వీట్
Vishwambhara Movie | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’