KTR : బీఆర్ఎస్ అగ్రనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనీ ! అర్జునస్య ధనుర్దారీ.. రామస్య ప్రియ దర్శినీ ! జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి ! పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి ! అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు, సరదాలు, సంతోషాలతో అందరూ దసరాపండుగ జరుపుకోవాలని కోరుకుంటూ… అందరికీ విజయదశమి శుభాకాంక్షలు’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇంగ్లిష్‌లో కూడా ‘Happy Dasara to all’ అని కేటీఆర్ రాసుకొచ్చారు. కాగా ఇవాళ దేశవ్యాప్తంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు. శ్రీరాముడు రావణాసురుడిని వధించిన రోజున దసరా ఉత్సవం జరుపుకోవడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నది.
శమీ శమయతే పాపం..శమీ శత్రు వినాశనీ !
అర్జునస్య ధనుర్ధారీ… రామస్య ప్రియ దర్శినీ!జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి !
పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి!అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు.. సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ…
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
Happy…
— KTR (@KTRBRS) October 12, 2024