Vishwambhara Movie | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 90% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో గుమ్మడికాయ కొట్టేయనుంది. ఇక డిసెంబర్లో పోస్ట్ ప్రోడక్షన్ పనులు కంప్లీట్ చేయనుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.
సంక్రాంతికి విశ్వంభర పోయి ఆ ప్లేస్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చి చేరింది. అవును తాజాగా ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుండటంతో విశ్వంభర సినిమాను మే 09రోజున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) విడుదల అయ్యింది ఆరోజే. దీంతో అదే రోజున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై విశ్వంభర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.