Rishabh Pant | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలం (IPL Auction)లో తాను అమ్ముడవుతానా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టాడు. ‘ఒకవేళ నేను వేలానికి వెళ్తే.. నన్ను ఎవరైనా తీసుకుంటారా..? తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను..’ అంటూ పోస్టు పెట్టారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని చర్చించుకుంటున్నారు. కొందరైతే ఇది ఫన్నీగా పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
If go to the auction. will I be sold or not and for how much ??
— Rishabh Pant (@RishabhPant17) October 11, 2024
కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ మూడో వారంలో ఈ మెగా వేలం ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రిషభ్ పంత్‌ను జట్టులోనే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో పంత్ పోస్ట్ చర్చనీయాశంగా మారింది.
Also Read..
Vijayadashami | దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Dasara Festival | దశదిశలా.. దసరా! ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుగుతుందీ వేడుక!